Meerpet murder: భార్యను చంపి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్లు బుక్ చేశాడు

Meerpet murder: భార్యను చంపి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ టికెట్లు బుక్ చేశాడు

 హైదరాబాద్ మీర్ పేటలో భార్యను కిరాతకంగా చంపి ముక్కలు చేసిన కేసులో  సంచలన  విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం  పోలీసుల అదుపులో ఉన్న  నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 జిల్లెలగూడకు చెందిన గురుమూర్తి జనవరి 15న సంక్రాంతి రోజున తన భార్య వెంకటమాధవిని హత్య చేసి.. ఆ తర్వాత స్నేహితుడితో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు టిక్కెట్లు బుక్ చేశాడంట. హత్యకు సంబంధించి అతని స్నేహితుడిని పోలీసులు విచారణకు పిలిచినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను హత్య చేసిన తర్వాత ఎనిమిది కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో  ఒకటి బడంగ్‌పేటలో నివసిస్తున్న తన సోదరికి కాల్ చేశాడు. 

ALSO READ | కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ కంపెనీలో మంటలు..

గురుమూర్తి   OTT బ్లాక్- కామెడీ థ్రిల్లర్  మూవీ సూక్ష్మదర్శిని చూసి మాధవి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే..

జనవరి 15న  మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఆమె భర్త గురుమూర్తికి  అతని తల్లి సుబ్బలక్ష్మమ్మ, చెల్లెలు సుజాత, తమ్ముడు కిరణ్ కూడా సహకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.