లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ

ప్రజలకు అండగా ఉంటూ అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. లంచాలకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు.  తాజాగా ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో సైదులు అనే వ్యక్తి  ఎస్ఐగా పనిచేస్తున్నాడు. 

అయితే.. ఓ కేసులో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బాధితుడి నుంచి రూ.10వేలు లంచం తీస్తుండగా ఎస్ఐ సైదులు ను రెడ్ అండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అనంతరం ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.