రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణకు పోలీసులు బ్లూరేస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ విజువల్స్ కీలకం కానున్నాయి. సీసీ కెమెరాల్లో గురుమూర్తి ఒక సంచిలో తీసుకెళ్లిన ఆనవాళ్లు గుర్తించారు పోలీసులు.. నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేసిన తరువాత ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రెండు సార్లు సీన్ ను రీకనస్ట్రక్ట్ చేశారు. గురుమూర్తి నివాసంలో కొన్ని ఆధారాలను సేకరించారు.
Also Read :- గుజరాత్లో ప్రైవేట్ స్కూల్ కు బాంబు బెదిరింపులు
గురుమూర్తి ఇంటిని నిశితంగా పరిశీలించిన క్లూస్ టీం హీటర్.. కుక్కర్.. టాయిలెడ్ ట్ గోడలపై ఉండే రక్తపు మరకలు అక్కడ లభించిన వెంట్రుకలు, గాజులు మరికొన్ని వస్తువులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. బీఎన్ ఎస్ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ కు సంబంధించిన సాక్షాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.