ఫుడ్ వద్దు.. గంజాయి ఇవ్వండి.. జైలులో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

ఫుడ్ వద్దు.. గంజాయి ఇవ్వండి.. జైలులో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

 

  • డ్రగ్స్​కు బానిసలైనట్టు గుర్తించిన అధికారులు
  • డీ అడిక్షన్ సెంటర్ లో ఉంచి అబ్జర్వ్ చేస్తున్న డాక్టర్లు


లక్నో: మీరట్​లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్​పుత్ ను దారుణంగా చంపేసిన ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్​శుక్లా గురించి షాకింగ్​ విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం వాళ్లిద్దరూ మీరట్ జిల్లా జైలులో రిమాండ్​ఖైదీలుగా ఉన్నారు. ముస్కాన్, సాహిల్ గంజాయి, డ్రగ్స్​కు బానిసలైనట్టు సీనియర్ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వీరేశ్ రాజ్ శర్మ చెబుతున్నారు. తమకు ఫుడ్ వద్దని గంజాయి, డ్రగ్స్​కావాలని అడుగుతున్నట్టు తెలిపారు. విత్​డ్రాయల్ ​సింప్టంమ్స్​తో వింతగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.

జైల్లో వింతగా ప్రవర్తన

జైలులో తమ ఇద్దరిని ఒకే రూమ్​లో ఉంచాలని నిందితులు డిమాండ్ చేశారు. అయితే అధికారులు ముస్కాన్ ను మహిళల బ్యారక్ లో, సాహిల్ ను పురుషుల బ్యారెక్​లో ఉంచారు. ముస్కాన్ ఫుడ్​ఏమీ తినలేదని, రాత్రంతా నిద్రపోలేదని వీరేశ్​రాజ్ శర్మ తెలిపారు. సాహిల్ సైలెంల్​గా ఉన్నాడని.. తనకు డ్రగ్స్ కావాలని జైలు సిబ్బందిని డిమాండ్ చేస్తున్నాడని వెల్లడించారు. ముస్కాన్​కూడా గంజాయి లేదా డ్రగ్స్​ఇవ్వాలని కోరిందన్నారు. సాహిల్ డ్రగ్స్ కు పూర్తిగా అడిక్ట్ అయ్యాడని.. అవి లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. దీంతో వారిని జైలులోని డీ-అడిక్షన్ సెంటర్​లో అబ్జర్వేషన్​లో ఉంచి పరిశీలిస్తున్నట్టు ప్రిజన్​అధికారులు పేర్కొన్నారు.

అత్యంత క్రూరంగా సౌరభ్ హత్య

సౌరభ్ రాజ్​పుత్ పోస్టుమార్టం రిపోర్టు అతని భార్య ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా ఆతన్ని ఎంత క్రూరంగా హత్యచేసింది వెల్లడించింది. ముస్కాన్ మత్తుమందు కలిపిన ఫుడ్ పెట్టడంతో సౌరభ్ స్పృహకోల్పోయాడు. తర్వాత సాహిల్, ముస్కాన్​ కలిసి పదునైన కత్తితో అతని గుండెల్లో మూడు సార్లు బలంగా పొడిచారు. ఆ తర్వాత అతన్ని ప్లాస్టిక్ డ్రమ్​లో పెట్టేందుకు తల, చేతులు ఇతర శరీరబాగాలను 15 ముక్కలుగా నరికారు. తర్వాత సిమెంట్​కలిపి అందులోపోసి మొత్తం సీల్ చేశారు.