జైల్లో ఉన్న మీరట్‌ మర్డర్‌‌ కేసు నిందితురాలు ప్రెగ్నెంట్‌

జైల్లో ఉన్న మీరట్‌ మర్డర్‌‌ కేసు నిందితురాలు ప్రెగ్నెంట్‌

మీరట్: ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో అరెస్టయిన మీరట్‌కు చెందిన ముస్కాన్‌ రస్తోగి ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ సంగతి తెలిసింది. ఈ విషయంపై మృతుడు సౌరభ్‌ రాజ్‌పుత్‌ కుటుంబ సభ్యులు స్పందించారు. పుట్టబోయే బిడ్డ సౌరభ్‌కు చెందినదైతే తాము దత్తత తీసుకుని పెంచుకుంటామని తెలిపింది. సౌరభ్‌ సోదరుడు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పుట్టబోయేది మా సోదరుడి బిడ్డే అయితే సంతోషంగా దత్తత తీసుకుని పెంచుకుంటాం”అని తెలిపారు. 

నిందితురాలు ముస్కాన్ కుటుంబం నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన నేవీ ఆఫీసర్‌‌ సౌరభ్‌ రాజ్‌పుత్‌ను ముస్కాన్‌ ప్రేమించి పెండ్లి చేసుకోగా 2019లో వీళ్లకు పాప పుట్టింది. ఆపై ముస్కాన్‌కు పరిచయమైన సాహిల్‌ శుక్లాతో కలిసి సౌరభ్‌ను దారుణంగా చంపేశారు. ఆయన డెడ్‌బాడీని 15 ముక్కలుగా నరికి సిమెంట్‌తో నింపిన డ్రమ్‌లో వేసి మూసేశారు. గత మార్చిలో ఈ విషయం బయటపడగా ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.