
యూపీలోని ఇందిరానగర్లో సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.సైబర్ మోసం కేసు ,సౌరభ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి ఆర్థికకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు సాహిల్ శుక్లా,ముస్కాన్ రస్తోగి బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
హత్యానంతరం లావాదేవీలు..కప్పిపుచ్చే ప్రయత్నం
సౌరభ్ దారుణ హత్య తర్వాత ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌కు పారిపోయారు. అధికారులను తప్పుదారి పట్టించేందుకు ముస్కాన్ సాహిల్ మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లారు. తద్వారా సౌరభ్ ఉన్న ప్రదేశం అతను బతికే ఉన్నట్లు కనిపించేలా జాగ్రత్తపడడ్డారు. కసోల్‌లో వారు గడిపిన సమయంలో హోటల్ బుకింగ్‌లు, మద్యం ,ఇతర కొనుగోళ్లతో సహా అన్ని ఖర్చులు సౌరభ్ ఖాతా నుంచిUPI లావాదేవీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ | Tihar Jail: పెద్దపెద్దోళ్లే చిప్పకూడు తిన్న.. తీహార్ జైలు షిఫ్ట్.. డిసైడ్ అయిన ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం
దర్యాప్తు అధికారులు సౌరభ్ ఖాతాను ఉపయోగించి జరిగిన అనేక లావాదేవీల ద్వారా షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. ముస్కాన్ ,సాహిల్ రోజూ రెండు బాటిళ్ల మద్యం, ఇతర పదార్థాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ సౌరభ్ ఖాతా నుండి UPI చెల్లింపుల ద్వారా చేశారని పోలీసులు తెలిపారు. నేరానికి ముందు, తరువాత ముస్కాన్ చేసిన అన్ని చెల్లింపులను ట్రాక్ చేయడానికి పోలీసులు సౌరభ్ బ్యాంకు ఖాతాను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సౌరభ్ ఖాతాలో రూ. 6 లక్షలు ఉన్నాయి. హత్యకు దారితీసిన సంఘటనల కాలక్రమాన్ని కలిపి చూడటంలో ప్రతి డిజిటల్ చెల్లింపు ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మీరట్ హత్య కేసు..
ఉత్తరప్రదేశ్‌లోని ఇందిరానగర్‌లో ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌తో కలిసి తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, అతని శరీరాన్ని ముక్కలు చేసి, శరీర భాగాలను సిమెంట్‌తో నింపిన డ్రమ్‌లో సీల్ చేసిన విషయం తెలిసిందే. నిందితుడు రాజ్‌పుత్ ఛాతీపై అనేకసార్లు పొడిచి, అతని శరీరాన్ని ముక్కలుగా చేసి, సిమెంట్‌తో నింపిన డ్రమ్‌లలో దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 12 మంది వ్యక్తుల నుండి అన్ని ఆధారాలు సేకరించి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.