భర్తను ముక్కలు ముక్కలు నరికి చంపి ప్రియుడితో హోలీ.. మర్చంట్ నేవీ ఆఫీసర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

భర్తను ముక్కలు ముక్కలు నరికి చంపి ప్రియుడితో హోలీ.. మర్చంట్ నేవీ ఆఫీసర్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

లక్నో: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌‌‌‌పుత్‎ను ప్రియుడితో కలిసి అతడి భార్య ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి ముస్కాన్ రస్తోగి మనాలి వెళ్లింది. అక్కడ కసోల్‌లోని హోటల్ పూర్ణిమలో ఆరు రోజుల పాటు ఈ జంట స్టే చేసింది. ఈ సమయంలో ఇద్దరు కలిసి అక్కడ జరిగిన హోలీ సెలబ్రేషన్స్‎లో పాల్గొని ఎంజాయ్ చేశారు. 

అలాగే.. ప్రియుడు సాహిల్ శుక్లా బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. హోలీ వేడుకల్లో సాహిల్ శుక్లా, ముస్కాన్ రస్తోగి ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్‎లు వేస్తోన్న వీడియోలతో పాటు.. ప్రియుడు సాహిల్ శుక్లా బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. భర్తను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని.. వీరిద్దరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస మానవత్వం, భయం లేని ఇలాంటి మనుషులకు ఎలాంటి శిక్ష వేసిన తక్కువేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మర్చంట్ నేవీ ఆఫీసర్​సౌరభ్ రాజ్‎పుత్‎ను అతని భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత భర్త డెడ్​బాడీని15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌‌‌‌ మీరట్‌‌‌‌లో జరిగింది. సౌరభ్ రాజ్‎పుత్ ముస్కాన్ రస్తోగిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 2019లోనే వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. 

కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా భార్యతో కలిసి వేరుగా ఉంటున్నాడు సౌరభ్. వేరు కాపురం పెట్టాక ముస్కాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముస్కాన్ తన లవర్ సాహిల్‌‌‌‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్‌‌‌‌కు తెలిసింది. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌరభ్ విడాకుల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. 

ఈక్రమంలోనే ఫిబ్రవరి 28న తన కూతురు బర్త్ డే ఉండటంతో సౌరభ్ ఫిబ్రవరి 24న ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే  మార్చి 4న సౌరభ్ తినే ఆహారంలో ముస్కాన్ నిద్రమాత్రలు కలిపింది. ఆపై సాహిల్, ముస్కాన్‌‌‌‌ కలిసి సౌరభ్‌‌‌‌ను కత్తితో పొడిచి చంపారు. డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంటుతో సీల్ చేశారు.