
యూపీలో మరో దారుణం..మాజీ మర్చంట్ నేవీ అధికారి సుభాష్ రాజ్ పుత్ హత్యను మర్చిపోకముందే..అదే తరహాలో మరో హత్య..యూపీలోని బిజ్నూర్ లో ఉద్యోగం కోసం భర్తను కడతేర్చింది ఓ భార్య.. తినే పదార్థాల్లో మత్తు మందు కలిపి దారుణానికి వడికట్టింది. ఏమీ తెలియనట్టు హార్ట్ అటాక్ తో చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే నిజం దాగలేదు..పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఉద్యోగం కోసం భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బీజ్నూర్ లో చోటు చేసుకుంది. ఈ హత్య వెనక వివాహేతర సంబంధం మరో కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో సమీపంలో ముక్రంద్‌పూర్ గ్రామానికి చెందిన దీపక్ నజీబాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. రైల్వే ఉద్యోగి.. మాజీ సీఆర్ పీఎఫ్ జవాన్..అతను గత జూన్ 17న చౌహర్‌పూర్ నహ్తౌర్‌కు చెందిన శివానీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఆరు నెలల కుమారుడు కూడా ఉన్నాడు. శ్రీరామనవమి(ఏప్రిల్6) రోజున దీపక్ కుమార్ తన నివాసంలో పూజ చేస్తూ హార్ట్ అటాక్ కు గురయ్యాడు.. దీంతో దీపక్ ను చికిత్స ఆస్పత్రికి తరలించారు.అప్పటికే దీపక్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.దీంతో అయితే దీపక్ హార్ట్ అటాక్ తో చనిపోలేదని..అతని మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దీపక్ భార్య శివానిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపక్ కుటుంబ సభ్యులు అనుమానించినట్లుగానే శివాని అతనిని హత్య చేసినట్లు ఒప్పుకుంది.
Also Read : అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం తీశాడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామనవమి రోజున దీపక్ కు తినే పదార్ధాల్లో స్లీపింగ్ టాబ్లెట్లు కలిపి ఇచ్చింది. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇదే అదనుగా శివాని భర్త ను మట్టుబెట్టింది. ఏమీ తెలియనట్లు భర్తకు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు..ఆస్పత్రికి తీసుకెళ్ళాను..అప్పటికే చనిపోయాడని దీపక్ కుటుంబ సభ్యులను నమ్మించేందుకు యత్నించింది. దీపక్ మృతిపై అతని బావకు అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టారు.
పోస్ట్మార్టమ్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. దీపక్ చనిపోయింది హార్ట్ అటాక్ తో కాదు..గొంతు నులిమి చంపారని వెల్లడైంది. అయితే దీపక్ ను చంపేందుకు శివానికి మరొక వ్యక్తి సహకరించి ఉంటారని కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానం వ్యక్త చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మార్చి 2023లో రైల్వేలో చేరిన దీపక్ గతంలో మణిపూర్‌లోని CRPFలో పనిచేశారు. అతను పారామిలిటరీ దళాన్ని విడిచిపెట్టి తన కుటుంబంతో స్థిరపడ్డాడు. అయితే దీపక్ కొత్త జీవితం ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే అతని జీవితం అకస్మాత్తుగా ముగిసింది. దీపక్ దారుణ హత్య, చిన్న బిడ్డను వదిలివెళ్లడంతో అతని కుటుంబ సభ్యులు దుఖంలో మునిగిపోయారు. నెలరోజుల్లో యూపీలో జరిగిన భార్య చేతిలో హతమైన భర్త కేసుల్లో దీపక్ హత్య రెండోది.