కుండ పెరుగు అమ్ముతూ.. రూ.10 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి

పెరుగు అంటే ఇష్టపడని వారుండరు. ఇది రుచికరమైన ఆరోగ్యాన్ని అందించే ఆహారం. అయితే మీరెప్పుడైనా మట్టికుండలో గడ్డ పెరుగును తిన్నారా.. దీని రుచి ఎంత అద్భుతంగా ఉంటుంది.  మార్కెట్లో దొరికే పెరుగు కన్నా చాలా రుచిగా ఉంటుంది. అయితే బీహార్‌లోని ఖగారియాకు చెందిన చంద్రభూషణ్ కుమార్ అనే పెద్దమనిషి.. ప్రస్తుతం తన ‘మట్కా’ పెరుగుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. మట్కా  పెరుగు అమ్ముతూ రూ. 10 లక్షలకు పైగా వ్యాపార టర్నోవర్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. 

బీహార్ లోని ఖగారియాకు చెందిన చంద్రభూషణ్ కుమార్ 2018లో మట్కా పెరుగు వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో సాధారణ పాత్రల్లోనే రోజువారీ వస్తువలను తయారు చేసేవాడు. అయితే అంతంతమాత్రంగానే బిజినెస్ సాగుతుండేది. కోవిడ్ తో లాక్ డౌన్ కారణంగా వ్యాపారం మూతపడింది.  లాక్ డౌన్ తర్వాత తన గ్రామం నుంచి వలస కూలీలతో కలిసి తిరిగి వ్యాపారం ప్రారంభించారు. గతేడాది సంక్రాంతి రోజున ప్రజలకు కుండ పెరుగును పరిచయం చేశారు. గావ్ సే బ్రాండ్ తో మట్కా పెరుగును అమ్ముతూ ఫేమస్ అయిపోయాడు. 

ఈ మట్కా పెరుగు ప్రత్యేకత ఏంటంటే.. కుండను బోర్లించినా.. అలాగే అతుక్కొని ఉంటుంది. కింద పడదు. అంత వర్జినల్  గడ్డ పెరుగు అన్నమాట. ‘‘ గావ్ సే పెరుగుకు ప్రజలనుంచి మంచి స్పందన ఉంది. బ్రాండెడ్ రకాల కంటే మట్కా పెరుగును ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని’’ చంద్రభూషణ్ కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మట్కా పెరుగుకు స్థానికంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. బీహార్ సరిహద్దులు దాటి సిలిగురి, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా మట్కా పెరుగు ఇప్పుడు ఫేమస్ అయింది.