వెరైటీ డ్రెస్సింగ్తో కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్

వెరైటీ డ్రెస్సింగ్తో కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్

ఈ రోజుల్లో కాలేజీకి వెళ్లాలంటే స్టైల్ గా ఉంటే ప్యాంటు, షర్టు... ఈ జనరేషన్ లో రోజురోజుకో కొత్త ఫ్యాషన్ వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన ఓ విద్యార్థి మాత్రం అండర్‌వేర్‌, తువ్వాలు ధరించి కళాశాలకు వస్తున్నాడు. జంగిల్ బుక్ సినిమాలోని మోగ్లీని తలపిస్తున్న ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకట. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని చెబితే.. వారితో మాట్లాడడమే మానేసేవాడట. పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. అతని తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా పట్టించుకోకుండా అలానే ఉండేవాడట. 

బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆ యువకుడిని చేర్పించేందుకు  ఈ వేషధారణలో తల్లిదండ్రులు వెళితే.. యాజమాన్యం ప్రవేశం కల్పించలేదట. చివరకు కలెక్టర్‌ అనుమతితో ప్రవేశం లభించిందట. అయితే కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన ఆ యువకుడు.. పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడట. ఎక్కడ దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని, ఉపాధ్యాయులు అతని నిర్ణయానికి అంగీకరించలేదు. అలా చాలా శ్రమపడి కళాశాలలో చేర్పించారు.  ప్రస్తుతం ఆ యువకుడు ఇంటర్‌ చదువుతున్నాడు. ఇప్పటికీ ఓ అండర్‌వేర్‌, పైనుంచి తువ్వాలు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించకుండా కాలేజీకి వెళ్తుండడం గమనార్హం.