- అకాల్ తఖ్త్ కు బదులు మోదీని కలవండి
- బీజేపీ పంజాబ్నేతలతో దల్లేవాల్
చండీగఢ్: రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తేనే నిరాహార దీక్ష విరమిస్తానని పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ తేల్చి చెప్పారు. దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన దీక్ష విరమించేలా చూడాల ని సిక్కుల సంస్థ అకాల్ తఖ్త్ను బీజేపీ ప్రతినిధుల బృందం గురువారం కోరింది.
దీనిపై జగ్జీత్ సింగ్ స్పందించారు. ‘‘నేను దీక్ష విరమించేలా చూడాలని అకాల్ తఖ్త్ను బీజేపీ కోరినట్టు తెలిసింది. అకాల్ తఖ్త్ ఆదేశాలను గౌరవిస్తాను. కానీ బీజేపీ వాళ్లు అకాల్ తఖ్త్కు బదులు ప్రధాని మోదీని కలవాలి. నేను దీక్ష విరమించాలంటే.. రైతుల డిమాండ్లు నెరవేర్చాలని ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది” అని సూచించారు.