Zepto.. నిమిషాల్లో కిరాణా వస్తువులను మీముందుంచే కంపెనీ.. కంపెనీ మొదలు పెట్టినప్పటి నుంచి ఆగకుండా దూసుకుపోతోంది. మార్కెట్లో పోటీదారులకు అందకుండా అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తోంది. రూ. 1.4 మిలియన్ డాలర్లు అనగా 11వేల 556 కోట్ల రూపాయలు టర్నోవర్ తో 2023లో దేశంలోనే మొట్టమొదటి యూనికార్న్ గా నిలిచింది.
ఈ కంపెనీని స్థాపించింది కేవలం 17 యేళ్ల కుర్రాడు.. అమెరికా కాలేజీలో డ్రాప్ అవుట్..ఇంజనీరింగ్ కోర్సును విడిచిపెట్టిన అదిత్ పాలిచా మరో పార్టినర్ కైవల్య వోహ్రాతో కలిసి 2021లో స్టార్టప్ కంపెనీనీ స్థాపించారు. ఈ ఇద్దరు యంగ్ బిజినెస్ మ్యాన్ లు తక్కువ కాలంలో కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాలిచా నికర ఆదాయం రూ. 11,556కోట్లు.. అతని వయస్సు కేవలం 21 యేళ్లు మాత్రమే.. ఏ రంగంలోనేనా దూసుకుపోవాలంటే వయస్సు కాదు.. టాలెంట్ అని నిరూపించాడు అదిత్ పాలిచా.
పాలిచా 2001లో ముంబైలో జన్మించాడు. కేవలం 17 యేళ్ల వయసులో కంపెనీలు స్థాపించాడు. 2021లో వోహ్రాతో కలిసి Zeptoని స్థాపించారు. కార్యకలాపాలు ప్రారంభించిన వారం రోజుల్లోనే స్టార్టప్ కంపెనీ విలువ 200 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ముంబైలో కంపెనీ ప్రధాన కార్యాలయం నడుస్తోంది. Zepto నిమిషాల్లో కిరాణా వస్తువులను అందిస్తోంది.