మన దేశపు అందగత్తె నిఖిత..ఓ టీవీ యాంకర్ అని తెలుసా

మన దేశపు అందగత్తె నిఖిత..ఓ టీవీ యాంకర్ అని తెలుసా

మన దేశపు అందగత్తెగా మధ్యప్రదేశ్కు చెందిన నిఖిత పోర్వా్ల్ నిలిచింది. ముంబైలోని ఫేమస్ స్టూడియలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నిఖితను 60వ ఫెమినా మిస్ ఇండియా విజేతగా ప్రకటించారు. మొదటి రన్నరప్ గా దాద్రాగనర్ హవేలీకి చెందిన రేఖా పాండే, రెండో రన్నరప్ గా ఆయుశీ ధోలాకియాలు నిలిచారు.  

గతేడాది మిస్ ఇండియా నందిని గుప్తా..నిఖితకు మిస్ ఇండియా కిరీటాన్ని అందించారు.మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్..ఈ ఏడాది ( 2024) మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు.

Also Read :- ముల్కీ ఉద్యమం అంటే ఏంటి.?.. నియమాలు ఏం చెబుతున్నాయి

18 ఏళ్ల వయసులో టీవీ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నటి నికితా పోర్వాల్, స్టోరీ టెల్లర్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 60కి పైగా నాటకాల్లో నటించింది. స్వయంగా 250 పేజీల 'కృష్ణ లీల' అనే నాటకాన్ని కూడా రాసింది. ఆమె అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడే చలన చిత్రంలో నటించింది, ఇది త్వరలో భారతదేశంలో విడుదల కానుంది.

నికిత కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యను పూర్తి చేసింది. బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో చదివింది. నికితా జంతు ప్రేమికురాలుకూడా.. యానిమల్ వెల్ఫేర్ స్పెసలిస్ట్.. అన్ని జీవుల పట్ల కరుణతో ఉండాలని తన ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రోత్సహిస్తోంది.