ఆసియా కప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో నేపాల్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. పసికూన జట్టుతో పాక్ పోరాటాన్ని చూడలేని అభిమానులు.. తమ దృష్టిని ఆ దేశ స్పోర్ట్స్ ప్రజెంటర్ వైపు మరల్చారు. అంత అందం తనది. అందువల్లే ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు అల్లుతున్నారు.
ముల్తాన్ వేదికగా జరుగుతోన్న నేపాల్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రోహా నదీమ్.. వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవ్వడంతో.. ఎవరీ అందగత్తె..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అందంతో పాటు చకచకా మాటలు అల్లగల నైపుణ్యమూ ఆమె సొంతం. అంత చక్కగా క్రికెట్‌ను కవర్ చేస్తోంది.
Truly honoured to be your host for the Asia Cup 2023 curtain raiser.
— Roha Nadeem (@RohaNadym) August 30, 2023
After 15 years this historic cup comes back to Pakistan soil. Glorious moment. ✨? #multan pic.twitter.com/FsQBcFuRUu
మహిళా క్రికెటర్, జర్నలిస్ట్
అలా అని ఈ అమ్మడు స్పోర్ట్స్ ప్రజెంటర్ మాత్రమే అనుకోకండి. మహిళా క్రికెటర్ కూడాను. 14 ఏళ్ల వయస్సులోనే రోహా కువైట్ అండర్ 19 జట్టుతో పాటు జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసింది. ఆపై మెల్లమెల్లగా యాంకరింగ్ వైపు అడుగులు వేసింది.
రోహా నదీమ్.. యూకేలోని కార్డిఫ్ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.