చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పాలక సంస్థ మేయర్‌గా తొలిసారి ఒక దళిత మహిళ ఎన్నికయ్యారు. 28 ఏళ్ల ఆర్.ప్రియను ఈ పదవికి డీఎంకే నామినేట్ చేసింది. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన ప్రియ.. ఈ పీఠాన్ని అలంకరించిన తొలి దళిత వ్యక్తిగానే కాకుండా అతి పిన్న వయస్కురాలిగానూ, మూడో మహిళగానూ రికార్డు సృష్టించారు. నార్త్ చెన్నూరులోని తిరువికా నగర్‌కు చెందిన ప్రియ.. 74వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)లో 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. చెన్నైకి గతంలో తారా చెరియన్, కామాక్షి జయరామన్‌లు మహిళా మేయర్లుగా పనిచేశారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన ప్రియ ఈ కోవలో మూడో మహిళగా నిలిచారు. ప్రియకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తాత చెంగయ్య శివం గతంలో డీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి ఆర్.రాజన్ ఈ ప్రాంతానికి పార్టీ సహ కార్యదర్శిగా ఉన్నారు.
Tamil Nadu | Greater Chennai Corporation gets its youngest and first-ever Dalit woman mayor, as DMK's R Priya takes the oath of office in Chennai. The 29-year-old is Chennai’s third woman mayor. pic.twitter.com/erfAt365h0
— ANI (@ANI) March 4, 2022
మరిన్ని వార్తల కోసం: