- లిస్ట్–ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్‌గా అన్మోల్‌ప్రీత్ రికార్డు
అహ్మదాబాద్ : పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ (45 బాల్స్‌లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 115 నాటౌట్) లిస్ట్–ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో 35 బాల్స్‌లోనే వంద కొట్టిన అతను 2009–10లో బరోడా బ్యాటర్ యూసుఫ్ పఠాన్ 40 బాల్స్‌లో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా లిస్ట్–ఎ క్రికెట్‌లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ.
మెక్‌గర్క్ (29 బాల్స్), డివిలియర్స్ (31) ముందున్నారు. అన్మోల్‌ప్రీత్ జోరుతో శనివారం జరిగిన గ్రూప్–సి మ్యాచ్‌లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో అరుణాచల్‌పై గెలిచింది. తొలుత అరుణాచల్ 48.4 ఓవర్లలో 164 రన్స్‌కే ఆలౌటైంది. తర్వాత పంజాబ్ 12.5 ఓవర్లలోనే 167/1 స్కోరు చేసింది. కెప్టెన్ అభిషేక్ శర్మ (10) ఫెయిలైనా, ప్రభుసిమ్రాన్ (35)తో కలిసి అన్మోల్‌ప్రీత్ రెండో వికెట్‌కు 153 రన్స్ జోడించాడు. అన్మోల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
శ్రేయస్ సెంచరీ చేసినా..
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (114 నాటౌట్) సెంచరీతో రాణించినా.. ముంబై బోణీ చేయలేకపోయింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో క్రిష్ణన్ శ్రీజిత్ (150 నాటౌట్) దుమ్మురేపడంతో గ్రూప్–సి మ్యాచ్‌లో కర్నాటక 7 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ముందుగా ముంబై 50 ఓవర్లలో 382/4 స్కోరు చేసింది.శ్రేయస్‌కు తోడు ఆయుష్ (78), హార్దిక్ తమోరే (84), శివం దూబే (63 నాటౌట్) రాణించారు. తర్వాత కర్నాటక 46.2 ఓవర్లలో 383/3 స్కోరు చేసి నెగ్గింది. కేవీ అనీశ్ (82), మయాంక్ అగర్వాల్ (47), ప్రవీణ్ దూబే (65 నాటౌట్) సత్తా చాటారు.