తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన సోఫియా ఫిర్దౌస్

 తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా  చరిత్ర  సృష్టించిన సోఫియా ఫిర్దౌస్

ఒడిశా చరిత్రలో తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా  సోఫియా ఫిర్దౌస్ చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని్కల్లో బారాబతి-కటక్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మ‌హాపాత్రపై 8,001 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. సోఫియా ఫిర్దౌస్  వయస్సు 32.  ఆమె తండ్రి మ‌హ్మద్ మోఖీం.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు. మొన్నటి వ‌ర‌కు క‌ట‌క్ నుంచి మ‌హ్మద్ మోఖీం ఎమ్మెల్యేగా కొన‌సాగారు. 

తండ్రి స్థానంలో కూతురు సోఫియాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.

సోఫియా ఫిర్దౌస్భువనేశ్వర్‌లోని KIIT యూనివర్సిటీ పరిధిలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-B) నుండి ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసింది. 1972లో అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి అడుగుజాడల్లో ఆమె నడుస్తోంది.