హనుమాన్..హనుమాన్..హనుమాన్..ఈ పేరులోనే ఉంది ఒక ప్రభంజనం.ఇలా ఈ పేరుతో వచ్చిన మూవీ హనుమాన్. ఈ సినిమా రిలీజ్ దగ్గర్నుంచి ఏదో ఒక విశేషం సంతరించుకుంటోంది. హనుమాన్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ అయ్యారు. భారీ కలెక్షన్స్ తో పాటు ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది.
అలాగే ఈ సినిమా చూసిన చాలా మంది సెలెబ్రెటీస్ తమ అభిప్రాయాన్ని, రివ్యూను ఇస్తు వచ్చారు. అయితే హనుమాన్ మూవీకు వచ్చిన అన్ని రివ్యూలలో ఒక స్పెషల్ రివ్యూ మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. అదేంటో మీకు కూడా తెలుసు.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తండ్రి ఇచ్చిన రివ్యూ. తన కొడుకు తీసిన సినిమా చూడటానికి మాములు వ్యక్తిగా వచ్చి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.హనుమాన్ సినిమా తీసినోడు నా కొడుకు అంటూ గర్వంగా ఫీల్ అవుతూ చెప్పడంతో..ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.
తాజా విషయానికి వస్తే..డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తండ్రి..సినిమా సెట్స్ లో సందడి చేశారు. తన కుమారుడితో కలిసి సెట్స్ కు వచ్చి డైరెక్టర్ సీట్ లో కూర్చుని మూవీ యూనిట్ తో మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫోటోని ప్రశాంత్ వర్మనే షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. 'సెట్స్ లో కొత్త డైరెక్టర్..ఈ వైరల్ పర్సన్ గుర్తున్నారా? ఆయన మాటలు గుర్తున్నాయా?' అని పోస్ట్ చేశారు.
ఇక ప్రశాంత్ వర్మ పోస్ట్ చేయడమే లేట్..సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆవుతుంది.నెటిజన్స్ కూడా ఫుల్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. 'ఆయనను ఎలా మర్చిపోతామన్నా..అని కొందరు కామెంట్స్ చేస్తుండగా..మరికొందరు గ్రేట్ ఫాదర్ అంటూ ట్యాగ్ ఇచ్చి తమ ఫీలింగ్స్ సెండ్ చేస్తున్నారు.
ALSO READ :- ఖమ్మం బరిలో టీడీపీ.?.. కమ్మ అభ్యర్థిని రంగంలోకి దించే చాన్స్
ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ ఏ మూవీ సెట్ నుంచి అనే విషయాలు వెల్లడించలేదు. అయితే..ఈ పిక్ అనుపమ తో తెరకెక్కించే ఆక్టోపస్ సెట్ అని చెబుతున్నారు.ఈ మూవీని జై హనుమాన్ కంటే ముందే థియేటర్స్ లోకి తీసుకురానున్నారు.
New director on set! 😎
— Prasanth Varma (@PrasanthVarma) March 20, 2024
Remember this viral guy and his famous line? 😊 pic.twitter.com/9Ml62CcITB