Baby of the House: బ్రిటన్ ఎంపీగా 22యేళ్ల కుర్రాడు

Baby of the House: బ్రిటన్ ఎంపీగా 22యేళ్ల కుర్రాడు

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జూలై 5 న వచ్చాయి. లేబర్ పార్టీకి చెందిన స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దాదాపు 14 అధికారంలో ఉన్న కన్జర్వేటి వ్ పార్టీ నేత, భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎక్కువమంది చాలామంది భారతీయ సంతతికి చెందినవారు బ్రిటన్ చట్ట సభలకు ఎన్నికయ్యారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.. కానీ కొత్తవిషయం ఏంటంటే.. ఈసారి బ్రిటన్ చట్ట సభలకు 22 యేళ్ల యువకుడు ఎన్నికయ్యాడు. 

శామ్ కార్లింగ్.. 22 యేళ్ల యువకుడు.. లేబర్ పార్టీకి చెందిన ఎంపీ.. నార్త్ వెస్ట్ కేంబ్రిడ్జ్ షైర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. స్వల్ప మెజార్టీతో గెలిచినప్పటికీ హౌజ్ ఆఫ్ కామన్స్ లో అడుగు పెట్టిన అతి చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. శామ్ కార్లింగ్ ను బేబీ ఆఫ్ ది హౌజ్ గా పిలుపుచుకుంటున్నారు హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యులు. 

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన శామ్ కార్లింగ్.. సీనియర్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ అభ్యర్థి శైలేస్ వరాను కేవలం 39 ఓట్ల తేడాతో ఓడించాడు. కార్లింగ్ తన విజయాన్ని రాజకీయ సునామిగా వర్ణించాడు. తనలాగే చాలా మంది యువకులు ప్రజాసేవకు  రావాలని ఆశిస్తున్నట్లు చెబుతున్నాడు కార్లింగ్. 

బేబీ ఆఫ్ హౌజ్ మిస్టర్ కార్లింగ్ మాట్లాడుతూ..తాను పోటీ చేస్తున్నాడని తెలుసుకుని చాలా మంది ఓటర్లు ఆశ్చర్యపోయారు.. అయితే చుట్టు పక్కల వాళ్లు మాత్ం చాలా సానుకూలంగా స్పందించారు. ఎక్కువ మంది యువకులు హౌజ్ ఆఫ్ కామన్స్ వెళ్లాలి అని తనతో చెప్పారని’’ అన్నారు. 
ఇతనికంటే ముందు మరో బీబీ ఆఫ్ హౌజ్ కూడా ఉన్నాడు.. అతనే కైర్ మాథుర్.. ఇతను 2023 జరిగిన సెల్బీ ఐన్ స్టీ ఉపఎన్నికల్లో గెలిచారు.