వేములవాడ, వెలుగు: వేములవాడ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్.. పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అంతకుముందు సిరిసిల్ల ప్రధాన రహదారిలోని నంది కమాన్ చౌరస్తా నుంచి చల్మెడ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో విడివిడిగా మాట్లాడారు. సమావేశంలో ప్లానింగ్కమిషన్ వైస్ చైర్మన్బి.వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ అరుణ, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, లీడర్ బాపు రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.