శుక్రవారం(మే 10) గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని మైదానంలోకి చొరబడ్డాడు. సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో పరుగెత్తుకొచ్చిన అభిమాని.. నేరుగా ఎంఎస్ ధోనీ వద్దకు వెళ్లి అతనికి పాదాభివందనం చేశాడు. ధోనీ కూడా అతన్ని పైకి లేపి హత్తుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది గ్రౌండ్లోకి వచ్చి ఆ అభిమానిని తీసుకెళ్లారు. చెన్నై జట్టు ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా, సదరు అభిమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మైదానంలోకి చొరబడిన యువకుడిని జై భారత్‌గా గుర్తించిన పోలీసులు.. అతను బీఏ చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. అక్రమంగా ప్రవేశించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు అహ్మదాబాద్ ఏసీపీ దిగ్విజయ్ సింగ్ రాణా శనివారం మీడియాకు వెల్లడించారు. ధోనిని కలవాలన్న కోరిక తప్ప.. మరే ఇతర ఉద్దేశాలు అతనికి లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
MS Dhoni had a word with the pitch invader after he hugged and touched MS' feet.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 11, 2024
- MS told security to go easy on the fan. ❤️pic.twitter.com/nuxgL1msOe
College student enters ground to meet Dhoni during IPL match in Ahmedabad, arrested
— ANI Digital (@ani_digital) May 11, 2024
Read @ANI Story | https://t.co/ssGn0b2M4W#GTvsCSK #MSDhoni #GujaratTitans #ChennaiSuperKings #IPL2024 pic.twitter.com/WPbx9KZ18y