శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు : రఘురాంరెడ్డి

శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు : రఘురాంరెడ్డి
  •     పాలెంలో వేరుశనగ మార్కెటింగ్​పై మీటింగ్

కందనూలు, వెలుగు : వేరుశనగ సాగులో శాస్త్రీయ విధానాలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం డైరెక్టర్​ రఘురాంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం బిజినేపల్లి మండలం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వేరుశనగ సాగు, మార్కెటింగ్ పై రైతులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇక్రిశాట్  సైంటిస్టులు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తారని తెలిపారు.

ఎకరాకు ఎంత దిగుబడి వచ్చిందనేదే ముఖ్యమని, విత్తనాలు వేసేటప్పుడు యాజమాన్య పద్ధతులను పాటిస్తే దిగుబడులు పెరుగుతాయని చెప్పారు. వేరుశనగకు ఆశించే తెగుళ్లు, కీటకాలు, పిగ్స్ బ్యాగ్ లపై అవగాహన కల్పించారు. అనంతరం విత్తన ఎంపిక, చీడపీడలు ఆశించకుండా రైజోబియం కల్చర్  విధానం

మార్కెటింగ్ పై డైరెక్టర్​ వివరించారు. పాలెం పరిశోధన కేంద్రం అసోసియేట్  డైరెక్టర్  మల్లారెడ్డి, ఇక్రిషాట్  సైంటిస్టులు హరికిషన్, జనీల, ఏడీ ఆర్  మల్లారెడ్డి, సుధారాణి, కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, డీఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.