నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గ్రూప్ 3 పరీక్షా నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17, 18 తేదీలలో జరగబోయే గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 9,478 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు తెలిపారు. గ్రూప్ 3 పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ల డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్ లు ముఖ్య పాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు. 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పరీక్షా కేంద్రాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తు ఉండాలని
సెంటర్ కు మూడు కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, రీజినల్ కోఆర్డినేటర్ మధుసూదన్ శర్మ, డీఎం హెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి, ఆర్డీవో సురేశ్ పాల్గొన్నారు.