ఉక్రెయిన్​పై సౌదీలో మీటింగ్

ఉక్రెయిన్​పై సౌదీలో మీటింగ్
  •   పాల్గొననున్న అమెరికా, రష్యా ప్రతినిధులు

మ్యూనిచ్/వాషింగ్టన్: ఉక్రెయిన్– రష్యా యుద్ధం ముగింపు విషయంపై చర్చించేందుకు త్వరలో సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధి బృందాలు భేటీ కానున్నాయి. అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, వైట్ హౌస్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ మీటింగ్ కు హాజరుకానున్నారు. 

రష్యా వైపు నుంచి ఎవరెవరు హాజరవుతారన్నది ఇంకా వెల్లడికాలేదు. ఈ మీటింగ్ విషయాన్ని శనివారం జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా అమెరికా ప్రతినిధి మైకేల్ మెక్ కాల్ట్ ప్రకటించారు. అయితే, ఈ మీటింగ్ కు ఉక్రెయిన్ తో సహా ఇతర యూరోపియన్ దేశాలను ఆహ్వానించలేదని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించడం కోసం పుతిన్, ట్రంప్ మధ్య భేటీకి ఏర్పాట్లు చేసేందుకే సౌదీలో రెండు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశం అవుతాయన్నారు.