అగ్రవర్ణాల కుట్రలో భాగం కావొద్దు : లొక్కుంట్ల ప్రవీణ్‌‌‌‌

జనగామ అర్బన్, వెలుగు : అగ్రవర్ణాల కుట్రలో బీసీలు భాగం కావొద్దని కాంగ్రెస్‌‌‌‌ ఓబీసీ సెల్​రాష్ట్ర కోఆర్డినేటర్‌‌‌‌ చింతకింది మల్లేశం, జిల్లా అధ్యక్షుడు లొక్కుంట్ల ప్రవీణ్‌‌‌‌ చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌ జనగామ పట్టణ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌‌‌‌ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌‌‌లో వారు మాట్లాడారు. జనగామలో పొన్నాలకు తప్ప ఎవరికి టికెట్‌‌‌‌ ఇచ్చినా సమంజసమేనని కొమ్మూరి వర్గీయులు అనడం సరికాదన్నారు.

నలభై ఏళ్ల నుంచి నుంచి ఒకే పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తి పొన్నాల అని, ఆయనను విమర్శించే స్థాయి ఎవరికీ లేదన్నారు. పొన్నాలకు టికెట్‌‌‌‌ ఇవ్వొద్దంటున్న వ్యక్తులు పార్టీకి ఏం చేశారో చెప్పాలని సవాల్‌‌‌‌ చేశారు. సమావేశంలో బడిగె కృష్ణస్వామి, జాఫర్ షరీఫ్​, ఎండీ సర్వర్, సలేంద్ర శ్రీనివాస్, రామకృష్ణ, నరేశ్‌‌‌‌గౌడ్‌‌‌‌, నాగరాజు పాల్గొన్నారు.