
పాలకుర్తి, వెలుగు : పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌లో గురువారం గ్రామాల వారీగా కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తన విజయానికి సహకరించే ప్రతి కార్యకర్త బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. అలాగే గ్రామాల్లో కోతుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.