గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ పద్మావతి

హుజూర్ నగర్ , వెలుగు : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి  సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ క్యాంప్ కార్యాలయంలో  మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బూత్, వార్డు, గ్రామ, మండల, బ్లాక్, నియోజకవర్గాల్లో  కమిటీల ఏర్పాటును స్పీడప్ చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించాలన్నారు.  

ఈ సమావేశంలో నేతలు సోము త్రివేణి , బచ్చలకూరి రజిత , గుర్రం జయమ్మ, సింగారపు అరుణ, బచ్చలకూరి సుగుణ , చప్పిడి సావిత్రి, నరాలశెట్టి పుల్లమ్మ, దొంతగాని వసంత, బొప్పి మహాలక్ష్మి, గోట్టెముక్కల నిర్మల, వశీకర్ల జయమ్మ, పోతురాజు జ్యోతి, మల్లెల శ్రావణి, కేతిరెడ్డి శకుంతలా రెడ్డి పాల్గొన్నారు.