‘సింగరేణి’ అద్దె వెహికల్స్ ఓనర్లతో సమావేశం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అద్దె వెహికల్స్​ యజమానులతో శుక్రవారం నిర్వహించిన మీటింగ్​లో పలు అంశాలపై చర్చించారు. బిల్లులను పాత పద్ధతిలోనే చెల్లించాలని యాజమానులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. కోల్​ ఇండియాలో వెహికల్స్​ టెండర్స్​కు అమలు పరుస్తున్న ఈపీఎఫ్​ పద్ధతి మాదిరిగానే సింగరేణిలోనూ సీఎంపీఎఫ్​కు బదులు ఈపీఎఫ్​ అమలు చేయాలని ఆఫీసర్లను కోరారు.

మెయిన్​టెనెన్స్​ గంటలతో పాటు యూనిట్​ రేట్​ పెంచాలన్నారు. వెహికల్స్​ఫైనల్ బిల్స్ ఆర్జీ–1 , శ్రీరాంపూర్​ ఏరియాల్లో  పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ఈ మీటింగ్​లో సింగరేణి యాజమాన్యం తరుపున జీఎం సీపీ జక్కం రమేశ్, జీఎంఈ అండ్ ఎంఎస్. జగన్​మోహన్​రావు, జీఎం పర్సనల్​ బి. హనుమంతరావు, డీజీఎం వరప్రసాద్, ఆఫీసర్లు లక్ష్మీనారాయణ, తిరుపతి, మురళి, శేషయ్య పాల్గొన్నారు.