ముథోల్​లో ​బీఆర్ఎస్​కు ​షాక్..  రేవంత్​ రెడ్డితో భేటీ

భైంసా, వెలుగు: ముథోల్​ సెగ్మెంట్​లో ​బీఆర్​ఎస్ ​పార్టీకి షాక్ ​తగలనుంది. ఆ ​పార్టీకి చెందిన కీలక నేతలు రెండ్రోజుల క్రితం హైదరాబాద్​లో టీపీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ముథోల్​ మాజీ జడ్పీటీసీ నర్సాగౌడ్ ​నేతృత్వంలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్​ పటేల్, మాజీ ఎంపీపీ భర్త సాయిబాబాతో పాటు పలువురు లీడర్లు కాంగ్రెస్​గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ALSO READ :సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: చింతా ప్రభాకర్

ఇప్పటికే రేవంత్ ​రెడ్డితో వారు పలు విషయాలపై చర్చించారు. ముథోల్​ఎమ్మెల్యే విఠల్​రెడ్డి ప్రధాన అనుచరుల్లో ముఖ్యులైన వీరంతా కొంత కాలంగా అంటిముట్టనట్లుగా ఉంటూ చివరకు కాంగ్రెస్​లో చేరబోతున్నారు. ఇప్పటివరకు ముథోల్​ బీఆర్​ఎస్​లో ఎలాంటి అసమ్మతి లేకపోగా.. తాజాగా ముఖ్య నేతలు పార్టీని వీడుతుండటం బీఆర్​ఎస్​లో గుబులు రేపుతోంది.