మెగా157 అప్డేట్ వచ్చేసింది.. సోషియో ఫాంటసీ కథతో సరికొత్తగా

మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మెగా157 గా రానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌(UV Creations) నిర్మిస్తుండగా.. బింబిసార(Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ(Mallidi Vasishta) తెరకెక్కించనున్నాడు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సంధర్బంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. 

పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రానున్న ఏ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రెలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పంచభూతాలతో కూడిన ఈ పోస్టర్ ను అద్భుతంగా క్రియేట్ చేశారు. మెగామాస్ బియాండ్ యూనివర్స్ అంటూ పోస్టర్ పై ఇచ్చిన క్యాప్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు మాకర్స్.  

Also Read :- అందుకే యోగీ కాళ్లు మొక్కాను : రజినీకాంత్

ఇవన్నీ చూస్తుంటే.. మెగాస్టార్ కోసం దర్శకుడు ఎదో గట్టిగానే ప్లాన్ చేశారు అనేది క్లియర్ గా అర్థమౌతోంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆడించునున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుంది. ఇక ఈ సినిమాకు పనిచేయనున్న కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.