కరీంనగర్ టౌన్, వెలుగు: రెనె హాస్సిటల్ చైర్మన్ డా.బంగారి స్వామి పుట్టినరోజు సందర్భంగా గురువారం హాస్పిటల్ లో శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్, శాతవాహన లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
హాస్పిటల్ఎండీ డాక్టర్ రజనీప్రియదర్శిని, ఏసీపీ ప్రతాప్ తో కలిసి డాక్టర్ బండారి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం రెనె హాస్పిటల్ క్యాలెండర్ ను ఏసీపీ ప్రతాప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ మెంబర్ మహమ్మద్ అబ్దుల్ గఫార్, మెడికల్ సూపరింటెండెంట్ డా రవీంద్రాచారి, డా.నిఖిల్ లక్ష్మణ్, డా.దినకర్, డా.రఫీ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.