
తాడ్వాయి, వెలుగు: ఈ నెల 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఈ నెల 14న తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. ఆదివారం తాడ్వాయిలో ఏర్పాటు చేసిన చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం అంబేద్కర్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గైని శివాజీ వెంకటరమణ, మాజీ సర్పంచ్ బండారి సంజీవులు, మహిపాల్, చిరంజీవి, నరేశ్, సంతోష్, వినయ్, గఫూర్ పాల్గొన్నారు.