![రజనీకాంత్తో ఆ ఒక్క సీన్.. లక్షల మందిలో నేను కూడా!](https://static.v6velugu.com/uploads/2023/08/Mega-brother-Nagababu-tweet-about-superstar-Rajinikanth-getting-viral_vaGLtjDVFH.jpg)
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైలర్(Jailer) మేనియా నడుస్తోంది. తలైవా.. తలైవా.. నినాదాలతో థియేటర్స్ మారుమ్రోగిపోతున్నాయి. రజనీకాంత్(Rajanikanth) జైలర్ గా థియేటర్స్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు. కటౌట్లు, దండాలు, పాలాభిషేకాలతో రజని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా పాజిటీవ్ టాక్ వస్తోంది. దీంతో జైలర్ మూవీ రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ: జైలర్ కోసం జపాన్ నుండి వచ్చేశారు.. ఇది కదా రజని క్రేజ్ అంటే
ఇక తాజాగా ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించిన మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. రజనీకాంత్ పై తనకున్న పిచ్చి అభిమానాన్ని, ప్రేమను తెలిపారు. అంతేకాదు జైలర్ షూట్ టైములో రజనీకాంత్ తో దిగిన ఫోటోస్ తో ఒక చిన్న వీడియో రూపంలో వాయిస్ ఓవర్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నాగబాబు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమందిలాగే తాను కూడా చిన్నప్పట్నుంచి రజినీకాంత్ ఫ్యాన్ అని, ఇప్పుడు ఆయనతో ఒక్క చిన్న సీన్ లో కనిపించడం చాలా ఆనందంగా ఉందని, జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు నాగబాబు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగ బాబూ చేసిన ఈ వీడియోకు మెగా ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Like millions of others, I am a devoted fan of Thalaiva @rajinikanth Experiencing one of those fanboy moments, I was filled with awe as I watched him on the screen. Acting alongside him was an incredible experience that created a beautiful memory. Looking forward to seeing you at… pic.twitter.com/eSpqLC78wp
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2023