జులై 18 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్..ఆన్​లైన్​లో నిర్వహణ

జులై 18 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్..ఆన్​లైన్​లో నిర్వహణ
  • .. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో11,062 టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన షెడ్యూల్​ను విడుదల చేశారు. అయితే, గతంలో జులై 17 నుంచి 31 వరకూ మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా.. వచ్చేనెల 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు పెడ్తామని వెల్లడించింది.

ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడుతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జులై18న స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ ఫిష్టిలో, సెకండ్ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు, సెకండ్ షిఫ్ట్ లో లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనున్నది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.