ఫస్ట్ టైమ్ పుష్ప టీం కి విషెస్ చెప్పిన మెగా హీరో.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..?

ఫస్ట్ టైమ్  పుష్ప టీం కి విషెస్ చెప్పిన మెగా హీరో.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప2: ది రూల్   డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మెగా హీరోలు కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటారు. కానీ ఈసారి పుష్ప 2 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా మెగా హీరోలు రియాక్ట్ కాలేదు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగబాబు తదితరులు సైలెంట్ గా ఉండటంతో మెగా హీరోలమధ్య వివాదాలు మొదలయ్యాయని కొందరు చర్చించుకుంటున్నారు. దీనికితోడు అల్లు అర్జున్ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవీంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొనడంతో మెగా హీరోలు సైలెంట్ గా ఉన్నారని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రూమర్లని మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పటాపంచలు చేశాడు. ఇందులోభాగంగా ట్విట్టర్ వేదికగా పుష్ప 2 సినిమా యూనిట్ కి విషెష్ తెలిపాడు. అలాగే పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులను ట్యాగ్ చేశాడు. 

దీంతో అల్లు అర్జున్ కూడా ఈ ట్వీట్ పై స్పందిస్తూ థాంక్స్ తేజు అని రిప్లై ఇచ్చాడు. అలాగే నీకు పుష్ప 2 సినిమా నచ్చుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. దీంతో మెగా హీరోలమధ్య వివాదాలకు దాదాపుగా తెరపడినట్లేనని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

ALSO READ : Allu Arjun: పుష్ప2 ప్రీమియర్‌కు రానున్న అల్లు అర్జున్.. హైదరాబాద్లో ఏ థియేటర్ అంటే?

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందాన  నటించగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించింది. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని కలసి నిర్మించారు. అయితే ఈ సినిమా  టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా దాదాపుగా రూ.100 కలెక్షన్స్ సాధించింది. దీంతో ఫస్ట్ డే పుష్ప 2 దాదాపుగా రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.