జూన్ 29న కొత్తగూడెంలో మెగా జాబ్​ మేళా

జూన్ 29న కొత్తగూడెంలో మెగా జాబ్​ మేళా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణ సొసైటీ ఫర్​ ట్రైనింగ్​ అండ్​ ఎంప్లాయిమెంట్​ ప్రమోషన్​, జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29న కొత్తగూడెంలో మెగా జాబ్​ మేళాను నిర్వహించనున్నట్టు కలెక్టర్​ జితేశ్​ వి. పాటిల్​ తెలిపారు. జాబ్​ మేళాకు సంబంధించి పోస్టర్లను బుధవారం కలెక్టరేట్​లో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం క్లబ్​లో జరుగనున్న ఈ మెగా జాబ్​ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్​ మేళాలో పాల్గొనేవారు ఆన్​లైన్​లో ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.