
సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగ యువతులు, మహిళలకు ఈనెల 23న సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘ క్యూస్ విన్నింగ్ టు గెదర్ ’ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
18 ఏండ్లు పై బడి టెన్త్, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఎంపికైనవారికి 15 రోజలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో తీసుకుంటారన్నారు. ఈ అవకాశాన్ని సిద్దిపేట నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు చెందిన యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9441799884/9848999990/ 99898 08022 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.