వరంగల్ ఈస్ట్​లో11న మెగా జాబ్ మేళా : కొండా సురేఖ

వరంగల్ ఈస్ట్​లో11న మెగా జాబ్ మేళా : కొండా సురేఖ
  • పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లా ఈస్ట్​లో మంత్రి కొండా సురేఖ చొరవతో ఈ నెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. సుమారు 100 కంపెనీలు 8 వేలకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం మంత్రి కొండా సురేఖ తన  నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం జాబ్ మేళా నిర్వాహకులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని జాబ్ మేళాకు వచ్చే యువతీ, యువకులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే జాబ్ మేళాకు 60 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 40 నుంచి 50 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 8 వేలకుపైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వివరించారు.