
కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్లో మార్చి 1న మెగా జాబ్ ఫెయిర్నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నిపుణ & సేవా ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. సోమవారం వర్సిటీలో జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. మెగా జాబ్‌ఫెయిర్‌లో మహిళలకు 1000కి పైగా జాబ్స్ అందించేలా కార్యాచరణ రూపొందించామన్నారు.
ఐటీ, ఫార్మా, ఇంజినీరింగ్, బ్యాంకింగ్, రిటైల్, తయారీ, మేనేజ్‌మెంట్ రంగాలకు సంబంధించిన 100కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. లక్ష నుంచి ఆరు లక్షల ప్యాకేజీ అందించే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా.కె.వెంకటేశ్వరరావు, నిపుణ ఫౌండేషన్ డైరెక్టర్ సుభద్రా రాణి మయారాం, ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ డైరెక్టర్ డా.ఎ.రజిని, డిప్యూటీ డైరెక్టర్ డా.జె.సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.