ఆగస్టు 31న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా.. 16వేల ఉద్యోగాలు

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఆగస్టు 31న మాసబ్ ట్యాంక్ ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ సంస్థలు, విద్య, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయని పత్రికా ప్రకటనలో తెలిపారు నిర్వాహుకులు.

Also Read:-సీఎం రేవంత్ సోదరుడితో సహా 204 మందికి నోటీసులు

ఈ జాబ్ మేళాలో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌లను కూడా అందిస్తాయని తెలిపారు.పదవ తరగతి ఆపైన చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. వాక్ ఇన్ పద్దతిలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని తెలిపారు. కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని, వివరాల కోసం, ఆసక్తి ఉన్నవారు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు నిర్వాహకులు.