కరీంనగర్ టౌన్, వెలుగు : మంకమ్మతోటలోని శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో శనివారం సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని చైర్మన్ ముద్దసాని రమేశ్‌రెడ్డి తెలిపారు. జాబ్‌మేళాలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేళాలో 35 ప్రముఖ కంపెనీలు రాగా 1600మంది అభ్యర్థులకు 300 మంది జాబ్స్ పొందినట్లు చెప్పారు.
కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ శ్రీరంగ ప్రసాద్, ప్లేస్‌మెంట్‌సెల్ డైరెక్టర్ మనోహర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిశోర్, ప్రసన్న హరికృష్ణ, సాహితీ సంస్థ ఫౌండర్ రాములకుమార్, ప్రిన్సిపాల్స్ డా.ఎల్.శ్రీనివాస్, వి.స్వర్ణలత పాల్గొన్నారు.