
ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ చదివి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న స్టూడెంట్స్ కు జవహర్‍లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‍టీయూహెచ్) మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తోంది. జేఎన్‍టీయూహెచ్ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్(యూఐఐసీ) జాబ్‍మేళా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. మెగా జాబ్ మేళా ఈనెల 20న జేఎన్‍టీయూహెచ్ క్యాంపస్‍లో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్పాసైన వారు ఈ జాబ్‍మేళాలో పాల్గొనేందుకు అర్హులు. 2017,18,19 అకడమిక్ ఇయర్‍లో ఉత్తీర్ణులు పాల్గొనవచ్చు. అర్హులైన ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్స్ ఈనెల 19 (మధ్యాహ్నం ఒంటిగంట) లోగా ఆన్‍లైన్‍లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి ఉచితం. జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే వారు సర్టిఫికెట్లు, రెజ్యూమ్స్ జీరాక్స్ కాపీలను తెచ్చుకోవాలి. మినిమం 5 సెట్ల జీరాక్స్ కాపీలను ప్రతి అభ్యర్థి వెంట తీసుకురావాలని యూఐఐసీ డైరెక్టర్ తెలిపారు.
పాల్గొనే కంపెనీలు
జెన్‍పాక్ట్, టీబీఎస్‍ఎస్, ఎగ్జామిటీ, కార్వీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ లాంబర్డ్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్, రోబోసిలికాన్, టాటా గ్రూప్, మారుతి సుజుకి, రెడ్ ఎంఐ, టీటీ హబ్, టోల్‍ప్లస్, కంట్రోల్‍ప్లస్‍ఎస్, నవ్‍టెక్ ఇండియా, అంపోరియా, ఓజాస్ ఐటీ, అప్‍స్ట్రిక్స్, అరైజ్ గ్లోబల్, కంపెనీలు జాబ్‍మేళాలో పాల్గొంటున్నాయి.
సెక్టర్‍ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, మాన్యుఫాక్చరింగ్, ఇన్‍ఫ్రా, సివిల్, కన్‍స్ట్రక్షన్, ఆటోమొబైల్, మెకానికల్ తదితర విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
జాబ్ రోల్
సాఫ్ట్ వేర్ డెవలపర్స్, జావా ట్రైన్డ్, సీఎస్‍ఏ/డెవలపర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, బ్యాంక్ ఆఫీస్/ బ్యాంకింగ్, మార్కెటింగ్/బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్/పర్సనల్ లోన్/ ఆటోలోన్స్/ క్రెడిట్ కార్డ్ లోన్స్, హెచ్ఆర్ ట్రైనీ, ఇంజనీర్ ట్రైనీ, మదర్ బోర్డు అసెంబ్లీ, క్వాలిటీ, కీ ఓపీఎస్, సీఎస్‍ఏ తదితర పోస్టులకు ఎంపికలు జరుగుతాయి.