- వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా
హనుమకొండ, వెలుగు : కష్టపడి పని చేసే యువత కోసం ఉద్యోగ అవకాశాలు క్యూ కడ్తాయని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో టీఎంఐ ఫౌండేషన్ సహకారంతో హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను సీపీ ప్రారంభించారు.
ఈ జాబ్ మేళాకు మొత్తం 1,349 రిజిస్ట్రేషన్స్ రాగా.. 164 మందికి 20కిపైగా కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి. అనంతరం జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన యువతకు సీపీ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీలు అబ్దుల్ బారి
టీఎంఐ ఫౌండేషన్ చైర్మన్ మురళీధరన్, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, తిరుమల్, సీఐలు సతీష్, సంజీవ్, సత్యనారాయణ రెడ్డి, షుకూర్, కేడీసీ ప్రిన్సిపల్ రాజిరెడ్డి, టీఎంఐ ఫౌండేషన్ ప్రతినిధి కృష్ణ పాల్గొన్నారు.