పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఇష్యూపై ఆందోళన చేపట్టారు అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు. పోటాపోటీగా జైభీమ్ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ముందు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎదురుపడ్డారు. అక్కడ జరిగిన స్వల్ప తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగీ, ముఖేష్ రాజ్ పుత్ కింద పడ్డారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోసేయడంతో అతను తనపై పడ్డారన్నారు. ఈ క్రమంలోనే తాను కిందపడ్డానని తెలిపారు బీజేపీ ఎంపీ సారంగీ. ఆయన్ను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కిందపడటంపై స్పందించారు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్లోకి వెళ్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. తనను నెట్టివేసి బెదిరించారన్నారు. ఆ సమయంలో తోపులాట జరడంతోనే బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ కింద పడ్డారన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీడియా కెమెరాల్లో ఉండొచ్చన్నారు రాహుల్. మల్లిఖార్జున ఖర్గేను కూడా బీజేపీ ఎంపీలు నెట్టివేశారన్నారు. పార్లమెంట్లోకి వెళ్లకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని.. అందులోకి వెళ్లే హక్కు ఉందన్నారు రాహుల్.
అంబేద్కర్ ఇష్యూపై పార్లమెంట్ ఆవరణలో ఇండియా, ఎన్డీయేల ఆందోళనలు చేపట్టాయి. మీరంటే మీరు అంబేద్కర్ ను అవమానించారని నిరసనలు తెలుపుతున్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా.. కేంద్రహోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక అసలు అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ఎదురుదాడికి దిగారు బీజేపీ ఎంపీలు. భారత రత్న ఇవ్వకుండా బాబాసాహెబ్ ను అవమానించారన్నారు. మరోవైపు అధికార, విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు డిసెంబర్ 19 మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
Delhi | BJP MP Mukesh Rajput also got injured. His condition is serious and he has been admitted to the ICU of RML hospital https://t.co/q1RSr2BWqu
— ANI (@ANI) December 19, 2024