రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ కోపం వస్తే.. వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ అన్ని ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఉన్న చరణ్ పాత్రలను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది. వైట్ కలర్ పంచెలో ట్రెడిషినల్‌గా, ఆఫీసర్‌గా కూల్ లుక్‌లో ఇంప్రెస్ చేశాడు. ఎస్‌జే సూర్య, సముద్రఖని, సునీల్ ఇతర పాత్రల్లో కనిపించగా, చివరగా ‘ఐయామ్ అన్ ప్రిడిక్టబుల్’ అని చరణ్ చెప్పడం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా లక్నోలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘శంకర్ గారితో కలిసి పని చేయడం అదృష్టం. ఇండియాలో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు. రామ్ చరణ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఆనందంగా ఉందని హీరోయిన్ కియారా అద్వానీ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంజలి అంది. టీజర్‌లో చూసింది కొంతే.. అసలు సినిమా ముందుంది అని నటుడు ఎస్‌జే సూర్య చెప్పాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘మా ప్రొడక్షన్‌లో 50వ చిత్రమిది. శంకర్ గారితో పని చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. పైగా అది రామ్ చరణ్‌తో అవ్వడం మరింత ఆనందంగా ఉంది’ అని అన్నారు.