మెగా డాటర్ క్లింకార ఫేస్ రివీల్.. కనబడకుండా చాలా ట్రై చేశారు

జూన్ 20న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan)..ఉపాసన( Upasana) దంపతులకు క్లింకార(Klin Kaara) జన్మించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న మెగా కుటుంబంలో క్లింకార రాకతో సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఇక పాప పుట్టి నాలుగు నెలలు గడుస్తున్నా..మీడియాకు మాత్రం పాపను చూపించలేదు మెగా ఫ్యామిలీ. దీంతో మెగా వారసురాలు ఎలా ఉందొ అని చూడటానికి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

లేటెస్ట్ గా మెగా వారసురాలు అయిన క్లింకార పేస్ రివీల్ అయింది. ఇంకో రెండ్రోజుల్లో (నవంబర్ 1న) జరగబోయే వరుణ్ తేజ్..లావణ్యల పెళ్ళికి మెగా ఫ్యామిలీ ఇటలీకి చేరుకున్నారు. అక్కడ వారు దిగిన ఫొటోస్ ను ఉపాసన తన ఇన్స్టా లో షేర్ చేసింది.

ALSO READ :- ODI World Cup 2023: అప్పుడు సచిన్.. ఇప్పుడు రచిన్: క్రికెట్ గాడ్ రికార్డ్ సమం చేసిన కివీస్ ఆల్ రౌండర్

అయితే, ఈ ఫోటోలో మాత్రం క్లింకార ఫేస్ ను లవ్ ఎమోజీతో కవర్ చేసినప్పటికీ..ముందున్న నీటిపైనా మెగా ప్రిన్సెస్ ప్రతిబింబం పడింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను రివర్స్ చేసి..అసలైన ఫొటో పక్కన పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ ను చూసేయండి..మెగా వారసురాలు క్లింకార ఇదిగో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.