పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను  గెలిపించాలని మెగాస్టార్  చిరంజీవి విజ్ఞప్తి చేశారు. పవన్ కు మద్దతుగా తన ట్విట్టర్లో  వీడియో రిలీజ్  చేసిన చిరంజీవి  ఏమన్నారంటే.. అమ్మకడుపులో ఆఖరికి పుట్టినా జనానికి మంచి చేయడంలో ముందుంటాడని చెప్పారు. తన కంటే జనం గురించే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం  తన తమ్ముడిదని. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తూడుస్తున్నాడని తెలిపారు.  

ఏ తల్లికైనా తన కొడుకు బాధపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు భాడపడుతుంటే బాధేస్తుంది.  తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆశక్తిని వినియోగించాలంటే  ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలంటే జనమే జయమని నమ్మిన జనసేనానిని పిఠాపురం ఓటర్లు   గెలిపించాలని చిరంజీవి కోరారు.
 
పిఠాపురంలో కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేస్తుండగా ..వైసీపీ నుంచి వంగగీత పోటీచేస్తున్నారు. ఇక్కడ పోరు రసవత్తరంగా ఉంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. ఇవాళ చిరంజీవి తన తమ్ముడికి మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు.