ఈ చిత్రం నా జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్.. చిరంజీవి స్పెషల్ ట్వీట్

1983లో కోదండరామిరెడ్డి( KodandaRami Reddy) దర్శకత్వంలో వచ్చిన ఖైదీ(Khaidi ) సినిమాతో చిరంజీవి(Chiranjeevi)కి స్టార్‌డమ్‌ వచ్చింది. అప్పట్లోనే ఈ సినిమా బడ్జెట్ రూ.25 లక్షలు తో తీసి..బాక్స్ ఆఫీస్ వద్ద రూ.8 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఖైదీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి.  

లేటెస్ట్ గా చిరంజీవి ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి(28 October 1983).. నేటితో 40 ఏళ్లు (28 October 2023) పూర్తవ్వడంతో చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ ఖైదీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీని చేసిందంటూ..అప్పటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు. 'ఈ చిత్రం నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్. ఖైదీ మూవీకి ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒకసారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూన్నాను.

ఇంతటి గొప్ప సినిమాను ఇచ్చిన దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి బ్రదర్స్ కి,హీరోయిన్స్ సుమలత, మాధవి లని అభినందిస్తూ..అంత గొప్ప విజయాన్ని మాకందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు! అంటూ చిరు ట్వీట్ లో పంచుకున్నారు. 

చిరంజీవికి ఖైదీ సినిమా తర్వాత వచ్చిన వరుస మూవీస్ తో వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వలేదు. మెగాస్టర్ అనే స్టార్ డాం సంపాదించించుకుని ప్రేక్షకుల గుండెల్లో అన్నయ్య అయ్యాడు. ఇక వరసగా జగదేక వీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా MBBS, ఠాగూర్, ఖైదీనెంబర్ 150, వరుస విజయాలను అందించాయి.

చిరు కెరీర్లో చేసిన విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం మెప్పించాడు. రుద్రవీణ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది. ఇప్పటివరకు 155 సినిమాలు చేసి..యంగ్ డైరెక్టర్స్ తో  వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. 

ALSO READ : భగవంత్ కేసరిపై ఫేక్ రూమర్స్.. చూస్తేనే అర్థమవుతోంది.. అనిల్ సూపర్ కౌంటర్