మాస్ బియాండ్ యూనివర్స్ .. మెగా156 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)మెగా156 మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌(UV Creations) నిర్మిస్తుండగా.. బింబిసార(Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ(Mallidi Vasishta) భారీ లెవెల్లో తెరకెక్కించనున్నాడు.

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మైథలాజికల్ జానర్ లో రానున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే..మెగా ఫ్యాన్స్ కు హై లెవెల్ హోప్స్ తెప్పిస్తున్నారు డైరెక్టర్. ఈ పోస్టర్ లో..భూమిని పెకిలించుకుంటూ వస్తోన్న త్రిశూలంతో.. చుట్టూ వలయం వంటి పర్వతాలతో పోస్టర్ అదిరిపోయింది.

మెగా మాస్..బియాండ్ యూనివర్స్ అనే క్యాప్షన్ ఇచ్చారు. పంచభూతాలతో కూడిన సోషియో ఫాంటసీ కథతో వస్తోన్న ఈ మూవీ.. ఇక ఏ విధంగా ఉండనుందో తెలుస్తోంది. ఇప్పటికే మెగా156 మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ విశ్వానికి మించిన మెగా మాస్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి పోస్టర్స్ తోనే సిద్ధం అయ్యాక..ఇక త్వరలో టీజర్ కనుక పడితే..మెగా మాస్ ను తట్టుకోవడం అంత సులువు కాదేమో! ఈ మూవీలో చిరుకి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే సమాచారం. ఇంకా ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ALSO READ :- అక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా... సూర్యాపేటలో సభ

ఇవన్నీ చూస్తుంటే..మెగాస్టార్ కోసం దర్శకుడు ఎదో గట్టిగానే ప్లాన్ చేశారు అనేది క్లియర్ గా అర్థమౌతోంది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో నిలపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.