"చిరంజీవి రంగస్థలం".. నరసాపూర్ YNM కాలేజీలో వేసిన 'రాజీనామా’ నాటకంను గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరు. లేటెస్ట్గా తన ఇంస్టాగ్రామ్లో కెరీర్లో వేసిన తొలి నాటకంను గుర్తుచేసుకుంటూ పోస్ట్ చేశారు.
" ‘రంగస్థలం’ మీద తొలి నాటకం.. YNM కాలేజీలో వేసిన 'రాజీనామా’ ! కోన గోవింద రావు గారి రచించిన రాజీనామా’ నాటకంతో నటుడిగా తొలి గుర్తింపు. అందుకు బెస్ట్ యాక్టర్గా గుర్తింపు పొందడం.. జీవితానికి ఎనలేని ప్రోత్సాహం..ఈ (1974 -2024) కాలం.. నా 50 సంవత్సరాల నట ప్రస్థానం..ఎనలేని ఆనందం" అంటూ చిరు (Chiranjeevi) తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు- మహా పురుషు లవుతారు’ అన్నాడొక సినీకవి. పట్టుదల, విశ్వాసం, క్రమశిక్షణ, ఓర్పు, కృషి మనిషిని అత్యున్నతంగా నిలబెడతాయి. ఈ మాటల ఆచరణకు ఎవరెస్టు శిఖరం లాంటి నిలువెత్తు సంతకం చిరంజీవి. అటు నట జీవితానికి, ఇటు సమాజ సేవకు తన నిబద్ధతను కనబరుస్తూ సమసమాజ కాంక్షిగా పరిశ్రమిస్తూ నేడు పద్మవిభూషణ్ వరకు ప్రయాణం ఎందరికో ఆదర్శం.
చిన్నతనం నుంచే యాక్టర్ కావాలనే ఆశలను రంగస్థలంపై రంగరించి చూపాడు. మనసులో నాటుకున్న యాక్టింగ్ ఆసక్తి డిగ్రీ పూర్తి కాగానే ఆయన్ని మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో జాయిన్ అయ్యేలా చేసింది.
Also Read : అమరన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్
పునాదిరాళ్లతో గట్టి నటనా పునాదులు వేసుకొని చిన్నా, పెద్దా అనకుండా ప్రతిపాత్రను ప్రాణంపెట్టి పోషించడమే అతని కౌశలంగా మార్చుకున్నాడు. ఆయన నటిస్తుంటే కైలాసం నుంచి శంకరుడే వచ్చి ఈ కొణిదెల శంకరుడుగా నటిస్తున్నడా! అనిపిస్తుంది. తెరమీద భావాలు పండించడం చూస్తే నవరసాలు ఆయన్ని కైవశం చేసుకున్నాయా అనిపిస్తుంది. శాస్త్రీయ నృత్యం నేర్చుకోకుండానే చేసిన డాన్స్ చూసేవారి మదిని మరిపించక మానవు. శరీరంలో ఎముకలున్నాయా! అన్నట్లుగా ఫ్లెక్సిబుల్‌గా ఏ స్టెప్ నైనా అలవోకగా చేసెయ్యగల దిట్ట.
ఇక తాజాగా తొలి నాటకం వేసిన సందర్భంగా తీసుకున్న ఫొటోని చిరంజీవి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో మెగా అభిమానులకు చాలా స్పెషల్ అనిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చిరు ఎంత మారిపోయారో (స్టైల్ లో, ఆ లుక్ లో) అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు.